Header Banner

దేశ భద్రత లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం..! ఎప్పుడంటే?

  Fri May 16, 2025 17:37        Politics

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారతదేశ భద్రతే లక్ష్యంగా మరో అడుగు ముందుకు వేసి ఈనెల 18న ఉదయం 5.59 ని,, లకు శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి పీఎస్ఎల్వీ సి 61 రాకెట్ ప్రయోగం ద్వారా EOS-09 అనే సాటిలైట్ విజయవంతం గా కక్షలోకి పంపనుంది. భారత దేశ రక్షణ రంగానికి దోహదపడే ఈ భూ పరిశీలన ఉపగ్రహం ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో అన్ని సన్నాహాలు సిద్ధం చేసింది. రాకెట్ అసెంబ్లింగ్ భవనం వద్ద రాకెట్ అనుసంధాన పనులు పూర్తి చేసి PSLV.. C61 రాకెట్ ను ప్రయోగ వేదిక వద్దకు విజయవంతం గా తరలించి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రోకు ఎంతో పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తున్న పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞాననంతో తయారు చేసిన పీఎస్ఎల్వీ సి 61 రాకెట్ ప్రయోగం ద్వారా ఈవో ఎస్ జీరో నైన్ (EOS..09) RISAT-1B ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని పనులు పూర్తి చేశారు. పిఎస్ఎల్వీ సి 61 రాకెట్ ను నాలుగు దశలుగా శాస్త్రవేత్తలు నిర్మించారు. ఈ ప్రయోగం ద్వారా భారత దేశానికి చెందిన EOS-09 (RISAT-1B) CGU SAT, LEAP-1 అనబడే మూడు ఉపగ్రహలను, అంతేకాకుండా US కు చెందిన PHOENIX SAT అదేవిధంగా POLAND దేశానికి చెందిన SOWA-1 ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తున ఉన్న SUN SYNCHRONOS ORBIT సూర్యానువర్తన కక్ష లోకి ఈ ఉపగ్రహాలను విజయవంతం గా పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు పనులు పూర్తి చేసి ఇస్రో 101 వ రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు..

అయితే గత ఏడాది చివరలో పిఎస్ఎల్వీ సి 60 రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత ఇన్నాళ్లకు ఇస్రో మరో pslv61 రాకెట్ ను షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ నెల 18న ఉదయం 5.59 నిమిషాలు కు ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధమైంది. అయితే ఇస్రో 100 వ రాకెట్ ప్రయోగం ద్వారా జిఎస్ఎల్వి ఎఫ్ 15 ప్రయోగించి ఘనవిజయాన్ని సాధించి ఉంది. ఇది ఇలా ఉంటే 101 వ రాకెట్ ప్రయోగం ద్వారా పిఎస్ఎల్వీ సి 61 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించి దేశ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇస్రో ఈ నిఘా ఉపగ్రహమును అవసరాన్ని గుర్తించి చకచకా పనులు పూర్తిచేసి ఈ నెల 18వ తేదీన ఉదయం 5.59 ని,,లకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ pslv 61 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ పనులను పూర్తి చేశారు .ఇస్రో ప్రస్తుతం 1710 కేజీలు బరువు కలిగిన ఈ ఓ ఎస్ 09 ఉపగ్రహంను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలోకి పంపనుంది. EOS.09 పేరుతో ప్రయోగిస్తున్న RISAT..1B భూ పరిశీలన ఉపగ్రహం కూడా అత్యంత శక్తివంతంగా దేశ సరిహద్దు ప్రాంతాలను అందులో ఉగ్రవాద కదలికలను రాత్రి పగలు తేడా లేకుండా పసికట్టే సామర్థ్యం కలిగి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇస్రో దేశ రక్షణ కోసం కనీసం 52 నిఘా ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టి భారతీయ రక్షణ రంగానికి విలువైన సేవలు అందించేందుకు ఇస్రో సైంటిస్టులు అహర్నిశలు శ్రమిస్తున్నారు..

శత్రువుల పనితీరును పసిగట్టేందుకు, సరిహద్దులను పర్యవేక్షించేందుకు ,సైనిక కార్యకలాపాల సమయంలో త్రివిధ దళాలకు సాయపడేందుకు ఈ EOS-09 SAT ఉపయోగపడుతుందని ఇస్రో వర్గాలనుంచి సమాచారం. అందుకే ప్రస్తుతం ఈ EOS..09 ఉపగ్రహ ప్రయోగంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా ఈవో ఎస్ జీరో నైన్ ఉపగ్రహం ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన హై రిజల్యూషన్ ఫోటోలను తీసి ఇస్రోకు పంపే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది .ఇందులో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ ప్రధాన ప్రత్యేకత కాగా ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా సునిసిత విశ్లేషణ చేసే సామర్థ్యం ఉపగ్రహంలోని ఉపకరణాలకు కలిగి ఉంటుంది .కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటు స్థాయి సంఘ సభ్యులు ఈ ఉపగ్రహాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు వస్తున్నందున శ్రీహరికోటలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు .ఏది ఏమైనా ఈ PSLV-C61 రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే దేశ రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్‌కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ISRO #PSLVC61 #EOS09 #RISAT1B #IndiaSpaceMission #SatelliteLaunch #NationalSecurity #ISROLaunch